దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్న సంగతి తెలిసిందే. టెస్లా కంపెనీ ఇండియాలో పెట్టు బడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఇక్కడి చట్టాల కారణంగా ఆ కంపెనీ వెనకడుగు వేస్తున్నది. ఇక దేశీయ వ్యాపర దిగ్గజం మహీంద్రా కంపెనీ అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టింది. కార్ల ప్లాంట్స్ ను ఏర్పాటు చేసింది. ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. ఇటీవలే ఫిల్మ్ కెమెరాను పట్టుకొని బిజీగా ఉన్నట్టు పేర్కొన్నాడు. దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు.
Read: కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు…ప్రపంచంలోనే మొదటిసారి…
మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సోషల్ మీడియాద్వారా ఆహ్వానం పలికారు. తప్పకుండా ఆహ్వానాన్ని పరిశీలిస్తానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కార్లకు గిరాకి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఓపెన్ చేసేందుకు అనేక కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ నెక్సాన్ రేంజ్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆశలు చిగురింపజేసింది. దేశీయ కార్ల కంపెనీలు తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను అందించేందుకు కృషి చేస్తున్నాయి.
