Site icon NTV Telugu

Nepal unrest: భారత పర్యాటకుల బస్సుపై దాడి, దోపిడి..

Nepal

Nepal

Nepal unrest: రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది.

ఇదిలా ఉంటే, ఖాట్మాండ్ లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్న భారతీయ యాత్రికుల బృందంపై గురువారం దాడి జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి బస్సు భారతదేశానికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు బస్సుపై రాళ్లు విసిరి, అద్దాలనుు పగలగొట్టారు. బ్యాగులు, నగలు, నగదు, మొబైల్ ఫోన్‌లతో సహా ప్రయాణికుల వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Read Also: Bhupalpally : భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రవాహంలో ఇరుక్కున్న ట్రాక్టర్ డ్రైవర్లు

ఈ ఘటనపై బస్సు డ్రైవర్ రాజ్ మాట్లాడుతూ.. దాడి చేసిన వాళ్లు రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టి మా వస్తువులను దోచుకెళ్లారని చెప్పారు. ఏడెనిమిది మంది ప్రయాణికులు గాయపడినట్లు చెప్పారు. అయితే, వెంటనే నేపాల్ సైనిక సిబ్బంది ప్రయాణికులను రక్షించినట్లు వెల్లడించారు. దెబ్బతిన్న బస్సు గురువారం సాయంత్రం యూపీలోని మహారాజ్‌గంజ్ సమీపంలోని సోనౌలి సరిహద్దుకు చేరుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను పెంచారు. నేపాల్‌లో అశాంతి కారణంగా యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వద్ద భద్రతను హై అలర్ట్‌లోఉంచారు. సరిహద్దు వెంబడి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Exit mobile version