NTV Telugu Site icon

Indian Navy: భారత నేవీ సాహసోపేత ఆపరేషన్‌.. ప్రమాదంలో ఉన్న చైనీయుడికి సాయం

Indiannavy

Indiannavy

తీవ్రరక్తస్రావమై ప్రమాదంలో ఉన్న చైనీయుడిని సాహసోపేతమైన ఆపరేషన్ చేసి ఇండియన్ నేవీ రక్షించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: 14 ఏళ్లకే ఒలింపిక్స్‌ లో చోటు సంపాదించిన భారత స్విమ్మర్..

ముంబైకి 300 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరకు రవాణా నౌక సిబ్బంది తమలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు అత్యవసర సందేశం పంపింది. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ అతడిని కాపాడింది. తీవ్ర రక్తస్రావమైన అతడికి అత్యవసర చికిత్స అవసరం కావడంతో ఆస్పత్రికి తరలించింది.

ఇది కూడా చదవండి: Demonte Colony2: వామ్మో..వణికిస్తున్న “డీమాంటీ కాలనీ 2” ట్రైలర్

ముంబైలోని మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు మంగళవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ కాల్‌ వచ్చింది. నౌకలో ఓ నావికుడి (51)కి అత్యవసర చికిత్స అవసరమని విజ్ఞప్తి చేసింది. దీంతో రంగంలోకి దిగిన భారత నావికాదళం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్‌తో ఆపరేషన్‌కు సిద్ధమైంది. తీవ్ర గాలులు, నౌకపై దిగేందుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ అతడికి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. తీవ్ర రక్తస్రావమైన ఆ బాధితుడిని చివరకు ఎయిర్‌లిఫ్ట్‌ చేసి తీరానికి తీసుకువచ్చి.. ఆస్పత్రికి తరలించినట్లు భారత నావికాదళం తెలిపింది.