Site icon NTV Telugu

నావికా ద‌ళానికి భారీగా పెరిగిన కేటాయింపులు…

కేంద్ర బ‌డ్జెట్ 2022-2023లో ర‌క్ష‌ణ రంగానికి భారీగా నిధుల‌ను కేటాయించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో సైనిక‌ద‌ళాల అవ‌స‌రాల కోసం కేంద్రం 5.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేటాయించింది. మూల‌ధ‌న కేటాయింపుల‌ను 12.82 శాతంగా పెంచి రూ. 1.52 ల‌క్ష‌ల కోట్లు కేటాయించారు. అయితే, ఈసారి వాయుసేన‌, ఆర్మీకంటే నేవీకి అధికంగా నిధుల‌ను కేటాయించారు. గ‌తేడాది కంటే ఈసారి నేవీకి 43 శాతం మేర నిధులు పెరిగాయి. వాయుసేన‌కు 4.5 శాతం కేటాయింపుల్లో పెరుగుద‌ల క‌నిపించ‌గా, ఆర్మీకి 12.2 శాతం మేర నిధులు త‌గ్గాయి. ప్ర‌పంచంలో చైనా నావికాద‌ళం క్ర‌మంగా విస్త‌రిస్తున్న‌ది. హిందూ, ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలో త‌న ఆదిప‌త్యాన్ని చ‌లాయించాల‌ని చైనా చూస్తున్న‌ది. ఆసియాలో చైనా ప్రాబ‌ల్యానికి అడ్డుక‌ట్ట వేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా భార‌త్ నావికాద‌ళం అధునాత‌న ఆయుధాల‌ను క‌లిగిఉండాలి.

Read: విశ్వంలో అత్యంత చౌకైన గ్ర‌హం ఏంటో తెలుసా?

నౌక‌లు, స‌బ్‌మెరైన్లు, యుద్ద విమాన వాహ‌క నౌక‌ల‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా ర‌క్ష‌ణ రంగంలో దేశంలో అనేక ఆయుధాలు త‌యార‌వుతున్నాయి. వీటిని ఎక్కువ‌గా నావికాద‌ళం వినియోగించుకుంటోంది. అంతేకాదు, దేశంలోనే సొంత టెక్నాల‌జీతో యుద్ధ‌నౌక‌లు, స‌బ్‌మెరైన్లు వంటివి త‌యారు చేస్తున్నారు. ఈ సంఖ్యను మ‌రింత‌గా పెంచాలంటే మూల‌ధ‌న నిధుల కేటాయింపులు పెర‌గాలి. ఇండియాలో త‌యారైన ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల‌నే ల‌క్ష్యంతో నావికాద‌ళానికి నిధుల‌ను పెంచారు. నావికాద‌ళానికి ఈ ఏడాది రూ.47,590.99 కోట్లు కేటాయించారు.

Exit mobile version