Site icon NTV Telugu

CAA: భారతీయ ముస్లింలు సీఏఏని స్వాగతించాలి: ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్..

Maulana Shahabuddin Razvi Bareilvi

Maulana Shahabuddin Razvi Bareilvi

CAA: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ని భారతదేశ ముస్లింలతా స్వాగతించాలని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏని నోటిఫై చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని స్వాగతించారు. ముస్లిం సమాజంలో భయాలను తొలగించడానికి ప్రయత్నించాలని, సీఏఏ ప్రభావం భారతీయ ముస్లింపై, వారి పౌరసత్వంపై ఉండదని అన్నారు. భారత ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమలు చేసింది, దాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ చట్టం ఇంతకుముందే అమలులోకి రావాలి, కానీ ఎప్పుడూ లేనంత ఆలస్యం జరిగిందని అన్నారు.

ఈ చట్టం గురించి ముస్లింలతో చాలా అపార్థాలు ఉన్నాయని, ఈ చట్టం వల్ల ఏమీ దకాని, ముస్లింలతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో మతం ఆధారంగా అఘాయిత్యాలు ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఇంతకుముందు ఎలాంటి చట్టం లేదని మౌలానా అన్నారు. కోట్ల మంది భారతీయులు ఈ చట్టం వల్ల అసలు ప్రభావితం కారని, ఈ చట్టం ఏ ముస్లిం పౌరసత్వాన్ని తీసేయదని, రాజకీయ నాయకులు ముస్లింలతో అపార్థాలు సృష్టిస్తున్నారని, భారతదేశంలోని ప్రతీ ముస్లిం కూడా సీఏఏని స్వాగతించాలని అన్నారు.

Read Also: Yemmiganur: పద్మ శ్రీ మాచాని సోమప్ప ఆశయాలు డా. మాచాని సోమనాథ్ తోనే సాధ్యం..

గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏ ఏ పౌరుడి పౌరసత్వాన్ని తీసేసేందుకు కాదని, మనదేశంలో మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారని, సీఏఏ అనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో హింసించబడిన శరణార్థులకు పౌరసత్వం అందించడం కోసమే అని అన్నారు. డిసెంబర్ 2019లో పార్లమెంట్ సీఏఏని ఆమోదించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి రావడంతో నిరసన సద్దుమణిగింది.

లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ ఈ బిల్లును నోటిఫై చేసింది. ఈ బిల్లు ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉండీ, మత వివక్ష ఎదుర్కొంటున్న ముస్లిమేతర అంటే హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, పార్సీ, జైన మతస్తులకు సంబంధించిన శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. డిసెంబర్ 31, 2014కి ముందు భారత్ వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.

Exit mobile version