Pakistan plan to launch terror attacks in India: భారత దేశంలో విధ్వంసం సృష్టించడానికి దయాది దేశం పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాడులు చేయడానికి ప్రణాళికలు చేసిందని ఇన్ పుట్స్ ఉన్నాయి. దీనికి అంతా తానై పాక్ గూఢాచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో దేశంలో చాలా ఉగ్రదాడుల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది.
అయితే ఈసారి ఇస్లామిక్ ఉగ్రవాదులను కాదని.. ఖలిస్తానీ ఉగ్రవాదులతో ఉగ్రదాడులు చేయించేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రదాడులు చేయాలని ఖలిస్తానీ ఉగ్రవాదులపై ఐఎస్ఐ తీవ్ర ఒత్తడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం భద్రతా సంస్థలు, సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వార్డ్ పోస్టులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రణాళిక రూపొందించారని ఐబీ హెచ్చరిస్తోంది.
Read Also: Shocking Video: పాముపై కాలేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఐఎస్ఐ ఖలిస్తానీ రూపంలో కొత్త ఉగ్రవాద కూటమిని సిద్ధం చేసింది. వీరంతా జమ్మూ కాశ్మీర్ లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు, ఉగ్రవాద గ్రూపులతో కుమక్కయ్యారని సమచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులు, భద్రతా ఏజెన్సీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్మీ-ఐఎస్ఐ సహకారంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పనిచేస్తున్నారు. వారికి కావాల్సిన లాజిస్టిక్, ట్రైనింగ్, ఆర్థిక సదుపాయాలను పాక్ ఆర్మీ కల్పిస్తోంది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఈ రెండు ఉగ్రవాదులతో ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్, ఇండియాలో దాడులకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కాశ్మీర్ లోని ఉగ్రవాద కార్యకలాపాలను, ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్లలో లేపేస్తున్నాయి.
