Site icon NTV Telugu

వారి కోసం కేంద్రం ఎమర్జెన్సీ వీసాలు…

కాబూల్‌లో ప్ర‌స్తుం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డడం లేదు.  ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ త‌రువాత ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయే, మ‌హిళ‌ల‌ను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే.  అందుకోస‌మే వీలైనంత వ‌ర‌కు దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే ఎంబ‌సీలు మూసేయ్య‌డంతో విదేశాల‌కు వెళ్లేవారు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంది.  దీనికోసం భార‌త ప్ర‌భుత్వం ఇ ఎమ‌ర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమ‌లులోకి తెచ్చింది.  దీనికోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన ఫోన్ నెంబ‌ర్‌ను, ఈ మెయిల్‌ను ఏర్పాటు చేసింది. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి భార‌త్‌కు రావాలి అనుకునే వారు ఎమ‌ర్జెన్సీ వీసా కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకుంటే వెంట‌నే ఆమోదించే అవ‌కాశం ఉంటుంది.  ఇప్ప‌టికే కాబూల్‌లోని ఎంబ‌సీ అధికారుల‌ను, భ‌ద్ర‌తా సిబ్బంది 120 మందిని భార‌త్‌కు త‌ర‌లించారు. వంద‌లాది మంది భార‌తీయులు ఆఫ్ఘ‌నిస్తాన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.  సిక్కులు, హిందువులు ఆ దేశంలో ఉన్నారు.  వీరిని త‌ర‌లించేందుకు భార‌త అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  వీరితో పాటుగా భార‌త్ రావాలి అనుకునే ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌జ‌లు కూడా ఇ ఎమ‌ర్జెన్సీ ద్వారా వీసాకు ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  

Read: కాబూల్ నుంచి అధికారులను భారత్‌కు త‌ర‌లింపు…

Exit mobile version