NTV Telugu Site icon

Justin Trudeau: ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులే ఎక్కువ..

Sanjay Verma

Sanjay Verma

Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పని చేసిన సీనియర్‌ దౌత్యాధికారి సంజయ్‌ వర్మ ఆరోపణలు చేశారు. రాజకీయ కారణాలతో వారికి ట్రూడో సర్కార్ రక్షణ కల్పిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read Also: US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలో మరో ట్విస్ట్‌..

ఈ సందర్భంగా ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ప్రధాని ట్రూడో‌ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ వర్మ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసులో కెనడా అధికారులు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నారు. భారత్‌ పట్ల కెనడా వ్యవహరించిన తీరు ఏమాత్రం పద్దతిగా లేదన్నారు. అంతేకాదు, భారత్‌కు వెన్నుపోటు పొడిచిందన్నారు. 26 మంది వేర్పాటువాదులు, గ్యాంగస్టర్ల అప్పగింతపై ట్రూడో ప్రభుత్వాన్ని పదే పదే అభ్యర్థించిన పట్టించుకోలేదన్నారు. ఇక, కెనడాది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలు.. మీకు ఒక చట్టం వర్తిస్తుంది.. మాకు మరొక చట్టం వర్తిస్తుంది అనేలా వ్యవహరిస్తుందని సంజయ్ వర్మ పేర్కొన్నారు.