NTV Telugu Site icon

India-Canada Relations: భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలను జస్టిన్‌ ట్రూడో చెడగొట్టారు..

Canada

Canada

India-Canada Relations: భారత్‌, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో నాశనం చేస్తున్నారని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ఆరోపించారు. ఖలిస్తానీ నేత హర్థిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను బయట పెట్టలేదని చెప్పారు. ఈ హత్య కేసు విషయంలో ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Read Also: Haryana Cabinet portfolios: మంత్రుల పోర్ట్‌ఫోలియో కేటాయింపు.. ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించారంటే

ఇక, ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు.. ఖచ్చితమైన సాక్ష్యం కంటే ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా చేసినవేనని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ తెలిపారు. బలమైన సాక్ష్యం లేదని ఆయనే చెప్పుకొచ్చారు.. ఇంటెలిజెన్స్‌ ఆధారంగా..ట్రూడో ఇరు దేశాల మధ్య సంబంధాన్ని నాశనం చేయాలనుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్ల కెనడా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని రాయబారి సంజయ్ వర్మ పేర్కొన్నారు.

Read Also: Group 1 Exams: నేడు గ్రూప్ -1 పరీక్షకు సర్వం సిద్ధం.. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..

కాగా, ఇటీవల భారత్‌ ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన విచారణలో భారత రాయబారి సంజయ్‌ కుమార్ వర్మకు సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసింది కెనడా.. ఈ నేపథ్యంలో ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిచింది. ఆ తర్వాత కెనడాలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను ఉపసంహరించుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది.