Indian Brands: 2047 నాటికి గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ ఎగుమతుల్లో మన దేశం షేరు ప్రస్తుతం 2.1 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. ఈ పర్సంటేజీని 2027 నాటికి 3 శాతానికి 2047 నాటికి 10 శాతానికి పెంచాలని ఆశిస్తోంది. 100 ఇండియన్ బ్రాండ్లను గ్లోబల్ ఛాంపియన్లుగా ప్రమోట్ చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎగుమతులకు, దిగుమతులకు గంటలోపే క్లియరెన్స్ ఇచ్చేందుకు ‘కస్టమ్స్ వన్’ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది.
UK PM Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్..
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతున్నందున India@2047 Umbrellaలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలు ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఆత్మ నిర్భర భారత్ పథకం విస్తరణలో భాగంగా ఇండియా వెలుపల కూడా ఎకనమిక్ జోన్లను ఏర్పాటుచేయనున్నారు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచనున్నారు. ఫార్మాస్యుటికల్స్, జెమ్స్, జ్యులరీ, మెరైన్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్స్, లెదర్, ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం ప్రొడక్ట్స్, కెమికల్స్ వంటి రంగాలపై ఫోకస్ పెడతారు.
టూరిజం, ఐటీ, ఐటీఈఎస్, బిజినెస్ సర్వీసెస్, హెల్త్‌కేర్, వెల్‌నెస్, ఎడ్యుకేషన్ మరియు ఏవీ సర్వీసెస్‌లకు సంబంధించి గ్లోబల్ సర్వీసెస్ ట్రేడ్‌లో టాప్-3లోకి రావాలనేది ఇండియా ప్లాన్. హై వ్యాల్యూ మరియు హై గ్రోత్ ప్రొడక్టుల సప్లయర్‌గా ఇండియాకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే రోడ్‌మ్యాప్ కూడా ఈ ప్రణాళికలో ఉంది. ట్రేడ్‌లో ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచటం, క్రియేటివ్ ఎకానమీలో 10 శాతం వాటాను పొందటం వంటి వాటిని సైతం అమలుచేయనున్నారు. బ్రాండింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫార్మాస్యుటికల్స్, టీ, కాఫీ, ఇంజనీరింగ్ గూడ్స్, సర్వీసుల ఎక్స్‌పోర్ట్‌లను ప్రమోట్ చేస్తారు. జిల్లాలని ఎక్స్‌పోర్ట్ హబ్‌లుగా డెవలప్ చేయనున్నారు.
