Kirti Chakra: గతేడాది సెప్టెంబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీర మరణ పొందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి ఈ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా మరణానంతరం ‘‘కీర్తిచక్ర’’ అవార్డును కేంద్ర ప్రకటించింది. మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మొత్తం ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. అవార్డ్ అందుకున్న వారిలో రైఫిల్‌మెన్ రవి కుమార్, మేజర్ ఎం నాయుడు ఉన్నారు.
Read Also: Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కు చెందిన కల్నల్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు.
ఆర్మీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్రవాదులు నక్కిన చొట ఆపరేషన్ బృందానికి మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించారు. ఉగ్రవాదులు దాక్కున్న భవనంపైకి ఎక్కుతున్న సమయంలో లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. కల్నల్ సింగ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య జగ్మీత్ కౌర్, పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరు మరియు రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నారు.