NTV Telugu Site icon

Indian Army: ఉగ్రవాదుల నుంచి గ్రామాలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలకు భారత సైన్యం శిక్షణ..!

Indian Army

Indian Army

Indian Army: జమ్మూ అండ్ కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడానికి భారత సైన్యం, జమ్మూ పోలీసులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం పౌరులను వారి గ్రామాలను రక్షించడానికి నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంతో పాటు ప్రాంతం యొక్క మొత్తం భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ పెట్టుకుంది. అయితే, దాదాపు 600 మంది ఆటోమేటిక్ రైఫిల్స్, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్, చిన్న వ్యూహాలను నిర్వహించడంలో ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ నైపుణ్యాలను త్వరగా ఉపయోగించుకునేలా సన్నద్ధం చేస్తున్నారు.

Read Also: Uttarpradesh : విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. రోడ్డు ప్రమాదంలో 15మంది మృతి

ఇక, ప్రతి వీడీజీ యూనిట్ కనీసం మూడు రోజుల నిర్మాణాత్మక శిక్షణను పొందునున్నారు. సరోల్‌లోని కార్ప్స్ బ్యాటిల్ స్కూల్ నుండి బోధకులు మరియు వనరుల మద్దతుతో ఇండియన్ ఆర్మీ ఫార్మేషన్స్ ఈ శిక్షణకు నాయకత్వం వహిస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇప్పటికే రాజౌరిలో 500 మంది వ్యక్తులు, దోడా, కిష్త్వార్‌లో 85–90 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇక, ఆర్మీ ఆర్డినెన్స్ డిపోలు, జమ్మూ & కాశ్మీర్ పోలీసుల సంయుక్త ప్రయత్నం ద్వారా అందించిన సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు)తో VDGలు కూడా డ్యూటీ చేయనున్నారు. వారి కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వారికి మరింత సాధికారతను భారత సైన్యం కల్పిస్తోంది.

Show comments