Site icon NTV Telugu

Indian Air Force: ఆపరేషన్ సింధూర్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన..

Iaf Operation Sindoor

Iaf Operation Sindoor

Indian Air Force: ఆపరేషన్‌ సింధూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్‌ ఇంకా ముగియలేదని తెలిపింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఐఏఎఫ్‌ అధికారులు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే, మాకు అప్పగించిన టార్గెట్‌లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేశాం. విచక్షణ, వివేకంతోనే ఆపరేషన్‌ సింధూర్ కొనసాగించాం అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌పై వస్తున్న ప్రచారం, ఫేక్‌ వార్తలను నమ్మవద్దు అని అధికారులు వెల్లడించారు.

Read Also: YS Sharmila: జవాన్ మురళి నాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు.. ఈ మదర్స్ డే అంకితం..

కాగా, ఆపరేషన్‌ సింధూర్‌కు విరామం తర్వాత ప్రధాని మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులు, సీడీఎస్ అనిల్‌ చౌహాన్‌, NSA అజిత్‌ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ మీటింగ్ కు హాజరయ్యారు. భారత్‌- పాక్‌ల మధ్య పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుండటం గమనార్హం. కాల్పుల విరమణలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. సరిహద్దుల్లో పరిస్థితిపై కూడా చర్చిస్తున్నట్టు టాక్.

Exit mobile version