Site icon NTV Telugu

India-US Deal: భారత రైతులకు భద్రత, వెనిజులా నుంచి చమురు.. భారత్-యూఎస్ డీల్‌..

Trump Modi

Trump Modi

India-US Deal: భారత్-అమెరికా మధ్య ప్రతిష్టాత్మక ట్రేడ్ డీల్ ఓకే అయింది. భారత్‌పై ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇదిలా ఉంటే, భారత రైతులు ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించలేదని ట్రేడ్ డీల్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆంక్షలు లేని’’ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే రెండో అతిపెద్ద దేశంగా ఉంది, అయితే, ఇప్పుడు రష్యా అమెరికా ఆంక్షల కింద ఉంది. దీంతో భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయమని పరోక్షంగా చెప్పినట్లు అయింది.

Read Also: T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

భారతదేశంలోని వ్యవసాయం రంగంలోకి తలుపులు తెరవాలని అమెరికా కోరింది. అయితే, దేశంలో ఇప్పటికీ అనేక మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉండటంతో సున్నితమైన ఈ రంగాన్ని కాపాడాలని మోడీ ప్రభుత్వం అనుకుంది. దీంతోనే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. సోయాబీన్, పాడి పరిశ్రమ వంటి వ్యవసాయ రంగాలను అమెరికాను భారత్ అనుమతించలేదు.

మరోవైపు, ఆంక్షలు లేని దేశాల నుంచి చమురు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వెనిజులా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెనిజులాపై యూఎస్ ఆంక్షలు ఉన్న సమయంలో ఆ దేశం నుంచి భారత్ చమురు కొనుగోలు చేయలేదు. మూడు రోజుల క్రితం, ట్రంప్.. భారత్ ఇరాన్‌కు బదులుగా వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలని సూచించారు. 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Exit mobile version