Site icon NTV Telugu

UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు

Untitled Design (4)

Untitled Design (4)

యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారులు ఫిన్ నెంబర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఫేస్, ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా పేమెంట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.

Read Also:Allegations: నా భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉంది.. పవన్ సింగ్ రెండో భార్య సంచలన వ్యాఖ్యలు

పూర్తి వివరాల్లోకి వెళితే…భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI).. సరికొత్త ఫీచర్ తో రానుంది. అక్టోబర్ 8 నుండి, వినియోగదారులు సంఖ్యా పిన్‌కు బదులుగా వారి ముఖం లేదా వేలిముద్రను ఉపయోగించి చెల్లింపులను ప్రామాణీకరించగలరని రాయిటర్స్ నివేదించింది. ఆధార్ డేటాతో నడిచే కొత్త బయోమెట్రిక్ ఆధారిత ప్రామాణీకరణ, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు లావాదేవీలను వేగంగా, సులభంగా, మరింత సురక్షితంగా చేయడానికి ఉపయోగపడుతుంది.

Read Also:Lover Caught at Girlfriend’s House: అర్థరాత్రి ప్రియురాలి ఇంటికి వచ్చిన ప్రియుడు.. లగ్గం చేసిన పెద్దోళ్లు

ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో NPCI ఈ కొత్త ఫీచర్‌ను ప్రదర్శించాలని యోచిస్తోంది. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు ఎలా ప్రామాణీకరించబడుతున్నాయో ఇది ఒక పెద్ద మార్పు అవుతుందని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థ భారత ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ డేటాపై ఆధారపడి ఉంటుంది. ఆధార్ ఇప్పటికే భారతీయ నివాసితుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు స్టోర్ చేసి ఉంచింది. వీటిని ఇప్పుడు చెల్లింపు ధృవీకరణ కోసం ఉపయోగిస్తారు. ఒక వినియోగదారు UPI చెల్లింపును ప్రారంభించినప్పుడు, వారి వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా లేదా మద్దతు ఉన్న పరికరాల ద్వారా ముఖ గుర్తింపును ఉపయోగించడం ద్వారా దానిని ప్రామాణీకరించే అవకాశం వారికి ఉంటుంది. ఈ ఫెసిటిలితో లావాదేవీల చెల్లింపుల్లో పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. పైగా వేగవంతంగా… సురక్షితంగా ట్రానిక్షన్స్ జరుగుతాయి.

Exit mobile version