పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో మోడీ ప్రసంగించారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు. ఈ అనిశ్చితి వేళ పెట్టుబడులకు భారత్ స్వీట్ స్పాట్‌గా మారిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథాన్ని కొనసాగించే దిశగా పరివర్తన మార్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం అని మోడీ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణ పీసీసీ కొత్త స్కెచ్..!
మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు, నైపుణ్యం, సుస్థిరాభివృద్ధి, వేగవంతమైన విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు ప్రధాని మోడీ చెప్పారు. భౌగోళిక అత్యవసర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రపంచమంతా భారత్ గురించి మాట్లాడుకుంటున్నార్నారు. ఆయా దేశాలకు మన దేశం పట్ల ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని చెప్పారు. గడిచిన పదేళ్లలో చేపట్టిన సంస్కరణలే అందుకు కారణమన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Israel: మరొక హిజ్బుల్లా కీలక నేతని ఖతం చేసిన ఇజ్రాయిల్..
మొబైల్ ఫోన్ల తయారీలో రెండో స్థానంలో ఉన్నామని ప్రధాని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసమే మన బలమని పేర్కొన్నారు. భారత అభివృద్ధి కోసం మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మోడీ వివరించారు.
కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిసిన్ అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరగనుంది. ప్రాముఖ్యంగా ఈ సదస్సులో కాన్‌క్లేవ్ గ్రీన్ ట్రాన్సిషన్, జియో-ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, అభివద్ధికి సంబంధించిన చిక్కులు, విధానపరమైన చర్యలు, సూత్రాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ సదస్సు జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వక్తులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కౌటిల్య ఆర్థిక సదస్సును ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: ICC Women’s T20 World Cup: భారీ స్కోరు చేసిన న్యూజిలాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?