NTV Telugu Site icon

Diseases Attack India: భారత్‌పై డేంజరస్ వ్యాధుల దండయాత్ర.. తస్మాత్ జాగ్రత్త

India Cancer Diseases

India Cancer Diseases

India To Suffer From Tsunami Of Chronic Diseases: ‘‘హమ్మయ్యా.. కరోనా వైరస్ నుంచి దాదాపు విముక్తి లభించింది.. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా ఉండొచ్చు’’ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. రానున్న రోజుల్లో మన దేశంపై క్యాన్సర్‌తో పాటు మరిన్ని ప్రమాదకరమైన వ్యాధులు దండయాత్ర చేయనున్నాయి. ఈ విషయం చెప్పింది మరెవ్వరో కాదు.. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, క్యాన్సర్ నిపుణులు డాక్టర్ జేమ్ అబ్రహమ్. భారత్‌లో పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, ఆర్థికాభివృద్ధి కలిసి.. వ్యాధుల ముప్పును పెంచనున్నట్టు ఆయన హెచ్చరించారు. ఒక్కసారిగా ఈ వ్యాధులు ముట్టుముడితే.. ఆ పరిస్థితిని అదుపు చేయడం దాదాపు అసాధ్యమని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఇందుకు పరిష్కారం ఏంటి?

Virat Kohli: హైదరాబాద్‌ జిమ్‌లో విరాట్ కోహ్లీ.. ఫ్యాన్స్ హంగామా

ఈ వ్యాధుల విపత్తు రావడానికి ముందే.. వాటిని నివారించేందుకు టెక్నాలజీతో కూడిన అత్యాధునిక వైద్య విధానాలను, ఆవిష్కరణలు చేపట్టాలని అబ్రహమ్ సూచిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి రాకుండా, అలాగే వచ్చిన తర్వాత దాన్ని తగ్గించే టీకాలను ఆవిష్కరించాలని చెప్పారు. దీనినే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు. కేన్సర్ సంరక్షణలో భాగంగా కొత్త టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులైతే తీసుకొస్తున్నాయి కానీ.. భారత్‌లో లక్షలాది మంది ప్రజలకు ఈ ఆధునిక వైద్య విధానాలను అందుబాటులో తీసుకురావడం అన్నది పెద్ద సవాలుతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. అమెరికాలోని ఓహియోలో క్లెవలాండ్ క్లినిక్ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్ అంకాలజీ చైర్మన్‌గా పని చేస్తున్న ఆయన.. మనోరమ 2023 మేగజైన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు.

Pudina Juice: పుదీనా జ్యూస్‌తో.. ఈ అనారోగ్య సమస్యలకి చెక్

మరోవైపు.. 2020లో ప్రపంచవ్యాప్తంగా 1.93 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడగా.. వారిలో కోటి మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2040 నాటికి ప్రతీ ఏటా 2.84 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తాయని గణాంకాల అంచనా. లంగ్ క్యాన్సర్ కారణంగా 18 శాతం మంది చనిపోతున్నారని.. అలాగే కొలరెక్టల్ క్యాన్సర్‌తో 9.4 శాతం, కాలేయ క్యాన్సర్‌తో 8.3 శాతం, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 6.9 శాతం ప్రాణాలు కోల్పోతున్నారని లెక్కలు చెప్తున్నాయి. భవిష్యత్తుల్లో ఈ క్యాన్సర్ వ్యాధి మరింత ముప్పుగా మారే ప్రమాదం ఉంది కాబట్టి.. దీన్ని ఎదుర్కునేందుకు టీకాలు నమ్మకమైన ఆప్షన్ అని అబ్రహమ్ చెప్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఎంఆర్ఎన్ఏ టీకాలతో ఇదివరకే పరీక్షలు నిర్వహించామని, మంచి ఫలితాలే వచ్చాయని, వాటిని మరింత అభివృద్ధి చేయాలని అభిప్రాయపడ్డారు. అయితే.. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీ అవసరమని, వీటి ద్వారా రేడియోలజిస్టులు, పాథాలజిస్టులు మరింత కచ్చితంగా క్యాన్సర్‌ను గుర్తించే వీలుందని అంటున్నారు.

Chiranjeevi: మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?

అబ్రహమ్ మాట్లాడుతూ.. ‘‘క్యాన్సర్ నిర్ధారణ కోసం ఇప్పుడు స్కాన్‌లు, మమ్మోగ్రామ్, కొలనోస్కోపీ, పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ట్యూమర్‌ని గుర్తించేలోపు ఆలస్యం అవుతోంది. లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీ సాయంతో చుక్క రక్తంతో కేన్సర్‌ను గుర్తించే విధానాలుండాలి, అప్పుడు ఆరంభ దశలోనే క్యాన్సర్‌ని గుర్తించేందుకు, అలాగే దాన్ని నివారించేందుకు సాధ్యపడుతుంది. ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ, కీమో థెరపీలను ఉపయోగిస్తున్నారు. వీటితో క్యాన్సర్ ట్యూమర్లు పూర్తిగా నయం అవుతున్నాయి. అలాగే.. క్యాన్సర్ రోగి రక్తం నుంచి కార్ టీ సెల్ కణాలను వేరు చేసి, లేబరేటరీలో మోడిఫై చేసి తిరిగి కేన్సర్ రోగిలోకి ప్రవేశపెడుతున్నారు. క్యాన్సర్ కణాలపై దాడి చేసే విధంగా కార్ టీ సెల్ కణాలను సిద్ధం చేస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు.

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.