NTV Telugu Site icon

GPS-Based Toll: ఇక “GPS-ఆధారిత టోల్” వసూలు విధానం.. ఎలా పనిచేస్తుంది..?

Gps Based Toll

Gps Based Toll

GPS-Based Toll: వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇక ఎదురుచూసే ఇబ్బందులు తప్పబోతున్నాయి. స్మూల్ డ్రైవింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రయాణించేలా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది. ప్రస్తుతం దేశంలోని హైవే టోల్ ప్లాజాల స్థానంలో GPS-ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ విధానం తసీుకువచ్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమించిందని గడ్కరీ గురువారం తెలిపారు.

ఫాస్ట్ ట్యాగ్‌లతో పాటు పైలెట్ ప్రాతిపదికన జీపీఎస్ టోక్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, హైవేలో ప్రయానించిన ఖచ్చితమైన దూరానికి వాహనాదారుడి నుంచి ఛార్జీలు వసూలు చేసే లక్ష్యంతో ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI యొక్క టోల్ ఆదాయం ప్రస్తుతం రూ. 40,000 కోట్లుగా ఉందని, 2-3 సంవత్సరాలలో ఇది రూ. 1.40 లక్షల కోట్లకు చేరుకోబోతోందని గడ్కరీ గతంలో చెప్పారు. 2018-19లో, టోల్ ప్లాజా వద్ద వాహనాల కోసం సగటు నిరీక్షణ సమయం 8 నిమిషాలు ఉంటే, 2020-21 మరియు 2021-22లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టడంతో, వాహనాల సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గించబడింది. 2021లో కేంద్రం టోల్ చెల్లించడానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది.

Read Also: Russia: భారత్‌ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..

GPS-ఆధారిత టోల్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

GPS ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ హైవేలపై అమర్చిన కెమెరాల ద్వారా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వ్యవస్థను ఉపయోగించి, వాహనం ప్రయాణించే దూరం ఆధారంగా టోల్ వసూలు చేస్తుంది. ప్రస్తుతం, FASTags ప్లాజాల్లో RFID ఆధారిత టోల్ సేకరణను ఉపయోగిస్తోంది.

హైవేలపై వాహనాలు వెళ్తున్న సమయంలో వాహనాల కదలికల్ని కెమెరాలు పర్యవేక్షిస్తాయి. ఎక్కడ ఎంట్రీ అయ్యారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారనే వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తుంది. మీ ప్రయాణ దూరాన్ని విశ్లేషించి టోల్ ఫీజును వసూలు చేస్తుంది. ఈ విధానం ద్వారా తక్కువ దూరం ప్రయాణించే వారికి న్యాయం జరుగుతుంది. ఈ విధానంతో రోడ్డుపై వాహనాలు టోల్ చెల్లింపుల కోసం ఎదురుచూడటం వంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు. సురక్షితమైన ఎలక్టోనిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా వాహనదారుడు లింక్ చేసిన ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా టోల్ ఫీజును వసూలు చేసుకుంటుంది. దీని వల్ల మానవతప్పిదాలకు, టోల్ ఎగవేత అవకాశాలు తగ్గుతాయి.