NTV Telugu Site icon

Cervical Cancer Vaccination: 9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. ప్రారంభించనున్న కేంద్రం..

Cervical Cancer Vaccination

Cervical Cancer Vaccination

Cervical Cancer Vaccination: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. సర్వైకల్ క్యాన్సర్‌ని అడ్డుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

Read Also: Prasanth Varma: హనుమాన్ ను దీవించడానికి నిజంగా హనుమంతుడే వచ్చాడు..

గర్భాశయ క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) భారతదేశ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రెండో ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. HPV వ్యాక్సిన్ ప్రస్తుత ధర రూ. 2000కి అందుబాటులో ఉంది. ఇది కేవలం గర్భాశయ క్యాన్సర్‌ని మాత్రమే కాకుండా మలద్వారాం, యోగి, ఒరోఫారింక్స్‌ని ప్రభావితం చేసే ఇతర ప్రాణాంతకాలను కూడా ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ సాయపడుతుంది. జననేంద్రియ మొటిమలకు కారణమయ్యే క్రిముల నుంచి రక్షణ అందిస్తుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కలిగించే ఆరోగ్య ప్రమాదాలను అడ్డుకుంటుంది.

ప్రపంచంలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులలో దాదాపు ఐదవ వంతుగా ఉన్న భారతదేశంలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్ ఇటీవల కాలంలో పెరుగుతోంది. క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుండి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గర్భాశక క్యాన్సర్‌ని చేర్చాలనే ఉద్దేశంతో కేంద్రం అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. టీకాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వైరస్‌కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటోంది.