NTV Telugu Site icon

Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత “మిస్ వరల్డ్” పోటీలకు భారత్ ఆతిథ్యం..

Miss World

Miss World

Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్ “మిస్ వరల్డ్” పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీకలు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ‘‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. #మిస్ వరల్డ్ ఇండియా #బ్యూటీ విత్ పర్పస్’’ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో మిస్ వరల్డ్ చైర్మన్ జూలియా మోర్లీని ఉటంకిస్తూ ప్రకటించారు.

Read Also: Rahul Gandhi: బ్రహ్మపుత్ర నదిలో రాహుల్ గాంధీ పడవ ప్రయాణం.. ఫొటోలు వైరల్

భారతదేశంలో చివరి సారిగా బెంగళూర్‌లో 1996లో ఈ పోటీలు జరిగాయి. తొలిసారిగా ఇండియా తరుపున రీటా ఫారియా పావెల్ 1966లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997 డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ కిరిటాన్ని సొంతం చేసుకున్నారు. గత పోటీల్లో పోలాండ్‌కి చెందిన కరోలినా బిలావ్క్సా విజేతగా నిలిచారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 మధ్య ఈ ఏడాది ఈవెంట్ నిర్వహించనున్నారు. మిస్ ఇండియా ఓపెనింగ్ సెర్మనీ ‘ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలా’ పేరుతో ఐటీడీసీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ అశోక హోటల్‌లో నిర్వహిస్తారు, ఫైనల్స్‌కి మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక అవుతుంది.