NTV Telugu Site icon

India- Bangladesh: భారత్తో సంబంధాలు బలంగానే ఉన్నాయి.. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ఆందోళన

Ban

Ban

India- Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో యూనస్, మిస్రీల మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగింది. అందులో మైనార్టీలైన హిందూవులపై దాడి, ఫేక్ న్యూస్ ప్రచారం, బహిష్కృత ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండడం, ప్రాంతీయ సహకారం, జూలై-ఆగస్టు మధ్య తిరుగుబాటు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇక, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. మేము ప్రస్తుత ప్రభుత్వంతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాం.. బంగ్లాదేశ్- భారతదేశం మధ్య సంబంధాలు చాలా ఘనమైనవని అభివర్ణించారు. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.. వాటిని తొలగించేందుకు భారత్‌ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య సాన్నిహిత్యం పెరగడంపై ఎలాంటి సందేహం లేదన్నారు. ఇది రెండు దేశాలకు మంచిది.. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ఇరు దేశాలు చర్చించాలన్నారు. అలాగే, బంగ్లాదేశ్‌లోని ఒక నిర్దిష్ట పార్టీతో మాత్రమే భారత్‌కు సంబంధాలున్నాయనేది అపోహ అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ అన్నారు. సంబంధాలు ఏ పార్టీతోనో కాకుండా అందరితోనూ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Read Also: Donald Trump: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..!

కాగా, ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం నుంచి చాలా ప్రకటనలు చేస్తుండటంతో మా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, హసీనా 15 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేయడానికి విద్యార్థులు, కార్మికులు, ఇతర వర్గాల ప్రజలు కలిసి జులై-ఆగస్టులో సామూహిక తిరుగుబాటును నిర్వహించారని తెలిపారు. ఇది కొత్త బంగ్లాదేశ్.. ఇక్కడ ప్రతి పౌరుడి భద్రతకు కట్టుబడి ఉంది తాత్కాలిక ప్రభుత్వం. అలాగే, వారి మతం, రంగు, జాతి, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హక్కులను పరిరక్షిస్తుందని మహ్మద్ యూనస్ వెల్లడించారు.

Show comments