NTV Telugu Site icon

India-Israel: ఇజ్రాయిల్‌కి ఆయుధాలను పంపుతున్న ఇండియా..?

India Israel

India Israel

India-Israel: భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేసిన మాజీ దౌత్యవేత్త డేనియల్ కార్మోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజాతో ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌కి మద్దతుగా భారత్ ఆయుధాలను పంపుతోందని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1999లో భారత్-పాకిస్తాన్ ‘‘కార్గిల్ యుద్ధం’’లో ఇజ్రాయిల్ అందించిన సహాయానికి గుర్తుగా భారత్ ఆయుధాలను పంపుతోందని అన్నారు. 2014-2018 వరకు భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారిగా పనిచేశారు.

గతేడాది అక్టోబర్ 07న గాజాలతోని హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హతమార్చారు. 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో అమాయకమైన పాలస్తీనియన్లు మరణిస్తు్న్నారు. ఇప్పటి వరకు 30,000కి పైగా ప్రజలు చనిపోయారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి. అయితే, హమాస్ తమ బందీలను పూర్తిగా విడుదల చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు. మరోవైపు యుద్ధం ఆపితేనే చర్చలు జరిపి బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. ఖతార్, ఈజిప్టు దౌత్యం ద్వారా చర్చలకు ఇజ్రాయిల్‌ని ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నాయి. హమాస్ పూర్తిగా నేలమట్టం అయ్యేదాకా యుద్ధం ఆపే ఆలోచనలో ఇజ్రాయిల్ లేదు.

Read Also: Niranjan Reddy: రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని జనం అడుగుతున్నారు..

ఈ సమయంలో కార్మోన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘కార్గిల్ యుద్ధ సమయంలో భారత్‌కి ఇజ్రాయిల్ మద్దతు ఉంది’’ 1999లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ భారత్‌కి అత్యాధునిక పరికరాలు, ఆయుధాలను అందించిన విషయాన్ని కార్మోన్ గుర్తు చేశారు. కార్గిల్ యుద్ధంలో ఇజ్రాయిల్ అండగా నిలిచిన విషయాన్ని భారతీయులు ఎప్పుడూ గుర్తు చేస్తారని, ఈ విషయాన్ని మరిచిపోరని, ఇప్పడు మళ్లీ ఇజ్రాయిల్‌కి ఆదరణ లభిస్తోందని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్‌కి భారత్ డ్రోన్లు, ఫిరంగి షెల్స్‌ని సరఫరా చేస్తుందనే నివేదికలు ఉన్నాయి.

ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో తయారైన అధునాతమైన హెర్మెస్ 900 డ్రోన్లను భారత్ ఇజ్రాయిల్‌కి సరఫరా చేసినట్లు వార్తలు ఉన్నాయి. భారత సైన్యానికి అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి ఇజ్రాయిల్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కోసం దాదాపు 20 డ్రోన్‌లను పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కార్మోన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. మే నెలలో చెన్నై నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ‘‘మారియాన్నే డానికా’’ అనే కార్గో షిప్‌ని స్పెయిన్ అడ్డగించింది. ఈ నౌకలో 27 టన్నుల సైనిక సామాగ్రి ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. ఇజ్రాయిల్‌కి భారత్ ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఇది ఆజ్యం పోసింది.

Show comments