NTV Telugu Site icon

Hypersonic missile: హైపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్షను సక్సెస్ఫుల్గా చేపట్టిన భారత్‌

Drdo

Drdo

Hypersonic missile: భారతదేశం తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ పరీక్షతో భారత్‌ కూడా దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణులున్న దేశాల జాబితాలో చేరిపోయింది. ఇది, ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది.

Read Also: Sundeep Kishan : తల్లికి కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్

కాగా, హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయం సాధించడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు. క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యాలు కలిగిన దేశాల సమూహంలో భారత్‌ చేరిందన్నారు. నేను, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ బృందాన్ని, మా సాయుధ దళాల యొక్క అద్భుతమైన విజయాన్ని అభినందిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ రాసుకొచ్చారు.