NTV Telugu Site icon

T-72 tank: రష్యాతో భారత్ $248 మిలియన్ల ఒప్పందం.. సరికొత్తగా T-72 ట్యాంకులు..

T 72 Tank

T 72 Tank

T-72 tank: భారత్, రష్యాతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. T-72 ట్యాంకుల 780 HP ఇంజన్లను, 1000 HPకి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది. పూర్తిగా అసెంబుల్ చేయడిన, పూర్తిగా నాక్-డౌన్ చేయబడిన, సెమీ-నాక్డ్- డౌన్ పరిస్థితుల్లో T-72 యుద్ధ ట్యాంకుల కోసం 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్‌లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ రక్షణ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్‌ మధ్య శుక్రవారం సంతకాలు జరిగాయి.

Read Also: RK Roja: చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్‌.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!

ఈ ఒప్పందంలో భాగంగా, రష్యన్ రక్షణ తయారీ సంస్థ నుంచి చెన్నైకి చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(హెవీ వెహికల్ ఫ్యాక్టరీ)కి టెక్నాలజీ బదిలీ ఉంటుంది. రక్షణ రంగంలో ‘‘మెక్ ఇన్ ఇండియా’’ చొరవ పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్‌లో T-72 చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం దీనికి 780 హెచ్‌పీ ఇంజన్లు అమర్చబడి ఉంది. ఇప్పుడు 1000 హెచ్‌పీ మార్చడం ద్వారా ట్యాంక్ వేగం, దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.