NTV Telugu Site icon

India Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.

Indian Economy

Indian Economy

India set to become 3rd largest economy by 2030: ప్రపంచం అంతా మాంద్యం అంచున ఉంటే ఒక్క భారత్ మాత్రమే వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూకేను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది ఇండియా. రానున్న కాలంలో మరింత వేగంగా భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2028-30 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనున్నట్లు మాజీ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ విర్మణీ అన్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), బ్లామ్ బర్గ్ నివేదికల ప్రకారం ఈ ఏడాది భారత్ 7 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని అంచానా వేస్తున్నాయి. ఇన్నాళ్లు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న యూకేను వెనక్కు నెట్టి భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దశాబ్ధం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా, బ్రిటన్ దేశాలు ఉన్నాయి. అయితే మరో ఏడేళ్లలో జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది.

Read Also: Nithyananda: విషమంగా నిత్యానంద ఆరోగ్యం.. కాపాడాలంటూ శ్రీలంక అధ్యక్షుడికి లేఖ

ఐఎంఎఫ్ గణాంకాలు, చారిత్రాత్మక ఎక్సెంజ్ రేట్ల ఆధారంగా బ్లూమ్ బర్గ్ వేసిన లెక్కల ప్రకారం బ్రిటన్ నున అధిగమించి ఐదోస్థానంలోకి చేరింది. జనవరి, మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ విలువ 854.7 బిలియన్ డాలర్లగా తేలింది. యూకే ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లుగా తేలిందని.. బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ఇప్పుడు ప్రపంచంలో అధిక వృద్ధిరేటు సాధిస్తున్న దేశంగా భారత్ ఉండటంతో మరికొన్ని రోజుల్లో బ్రిటన్, ఇండియాల మధ్య అంతరం మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు 2029నాటికి మూడో స్థానానికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ జీడీపీ వాటా 2014లో 2.6 శాతం ఉంటే ఇప్పుడు 3.5కు చేరింది. 2027నాటికి 4 శాతానికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం జర్మనీ ఈ స్థానంలో ఉంది. అయితే 2014 నుంచి భారత్ అనుసరిస్తున్న విధానాలను చూస్తే 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించే అవకాశం ఉంది.