NTV Telugu Site icon

Delhi: మయన్మార్‌కు మరోసారి భారీ సాయం పంపించిన భారత్

Myanmarindia

Myanmarindia

మయన్మార్‌కు మరోసారి భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆదివారం భారీగా సాయం పంపించింది. శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా శనివారం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించారు. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని పంపించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్‌కు పంపించారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్‌ఎస్ కర్ముక్, ఎల్‌సీయూ 52లో 30 టన్నుల సాయాన్ని పంపించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ కొనసాగుతోందని కేంద్రమంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య హవా.. భారీగా రెమ్యునరేషన్..

శుక్రవారం మయన్మార్, థాయ్‌లాండ్‌లో రెండు సార్లు శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకున్నాయి. 7.7 7.4 తీవ్రతతో భూకంపాలు జరిగాయి. భారీ భవంతలు నేలకూలాయి. ఇప్పటి వరకు 1700 మంది చనిపోగా… వందిలా మంది క్షతగాత్రులయ్యారు. ఇక వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే భూకంపాలు జరగగానే ప్రధాని మోడీ ఆరా తీశారు. మయన్మార్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.