Site icon NTV Telugu

India-Russia: రష్యా ఆయిల్ దిగుమతులు డబుల్.. కీలక ఒప్పందం దిశగా భారత్..

Modi Putin

Modi Putin

India-Russia: ఇరాన్ యుద్ధం రష్యా పంట పండిస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యన్ క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పెంచాలని చూస్తోంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో రష్యా వాటాను 40 శాతానికి పెంచాలని చూస్తోంది. ఇది జనవరి 2026 దిగుమతులతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు. ఈ విషయం అమెరికాకు కూడా తెలిసే జరుగుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా రష్యన్ ఆయిల్ కొనుగోలుపై నిషేధాన్ని ఎత్తేసింది.

LNGపై రష్యాతో చర్చలు:

మిడిల్ఈస్ట్ సంక్షోభం కారణంగా, భారత్ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్పీజీపై ప్రభావం పడింది. దేశంలో వంట గ్యాస్ సమస్యను పరిష్కరించేందుకు భారత్ రష్యా వైపు చూస్తోంది. నివేదికల ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా, ఒక ప్రధాన ద్రవీకృత సహజ వాయువు (LNG) ఒప్పందంపై భారతదేశం మరియు రష్యా మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా LNGని కొనుగోలు చేయాలనే తన ఉద్దేశాన్ని భారతదేశం అమెరికాకు తెలియజేసిందని వర్గాలు సూచిస్తున్నాయి.

Exit mobile version