Site icon NTV Telugu

BrahMos missile: అడ్వాన్సుడ్” బ్రహ్మోస్ మిస్సైల్” తయారీ కోసం భారత్, రష్యా చర్చలు..

Brahmos Missile

Brahmos Missile

BrahMos missile: ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉపయోగించిన ‘‘బ్రహ్మోస్ మిస్సైల్స్’’ శక్తిని ప్రపంచమంతా చూసింది. ముఖ్యంగా, పాకిస్తాన్ కి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై దాడుల్లో బ్రహ్మోస్ పనితనం బయటపడింది. అయితే, ఇప్పుడు అడ్వాన్సుడ్ బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ కోసం భారత్, రష్యాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రష్యా పూర్తి సాంకేతిక సహాయాన్ని అందించిందని పలు నివేదికులు పేర్కొన్నాయి. లక్నోలో కొత్తగా ప్రారంభించబడిన బ్రహ్మోస్ తయారీ ఫెసిలిటీలోనే అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసే లక్ష్యంతో ఇప్పటికే చర్చలు జరిగాయని తెలుస్తోంది.

Read Also: Pakistan: “అమెరికా యుద్ధాల వల్ల లాభపడుతోంది”.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

రూ. 300 కోట్ల వ్యయంతో లక్నోలో నిర్మించిన ఈ ఫెసిలిటీలో, కొత్త బ్రహ్మోస్ క్షిపణులు తయారు కాబోతున్నాయి. ప్రస్తుతం బ్రహ్మోస్ వెర్షన్ 290-400 కి.మీ పరిధిని, మాక్ 2.8 గరిష్ట వేగాన్ని కలిగి ఉంది. బ్రహ్మోస్ భారత్-రష్యాల జాయింట్ వెంచర్. దీనికి బ్రహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్లపై బ్రహ్మోస్‌గా పిలుస్తారు. దీనిని భూమి, సముద్రం, గాలి నుంచి కూడా ప్రయోగించవచ్చు. ‘‘ఫైర్ అండ్ ఫర్గాట్’’ వ్యవస్థను ఇది కలిగి ఉంది. కొత్తగా అభివృద్ధి చేయబోయే బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 800 కి.మీ వరకు విస్తరించే దిశగా భారత్ పనిచేస్తోంది. మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్(MTCR)పరిమితుల కారణంగా మొదట్లో 290 కి.మీ.కు పరిమితం చేయబడిన ఈ క్షిపణి పరిధిని జూన్ 2016లో భారతదేశం MTCRలో చేరిన తర్వాత 450 కి.మీ.కు పెంచారు.

Exit mobile version