Site icon NTV Telugu

Omicron new variant: భారత్‌లో కొత్త వేరియంట్‌ కలకలం.. ముంబైలో తొలి కేసు..

Omicron Xe

Omicron Xe

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ టెన్షన్‌ కాస్త తగ్గిపోయింది… భారత్‌లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్‌ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్‌లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్‌ రూపంలో భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.. మరో విషయం ఏంటంటే.. యూకేలో జనవరి 19వ తేదీన ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

Read Also: Fuel Prices: కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగలేఖ.. దోపిడీ కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా..?

అయితే, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’పై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)… యూకేలో మొదటగా ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ గుర్తించారు. అత్యంత వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.. బీఏ1, బీఏ2 రకాల కలయికతో ఉన్న కొత్త వేరియంట్ ‘ఎక్స్ఈ’ను జనవరిలో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది.. వణుకుపుట్టించే విషయం ఏంటంటే.. బీఏ 2 రకం కంటే 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఎక్స్ఈ వేరియంట్‌కు ఉండడమే.. ఇప్పుడిప్పుడే.. సాధారణ పరిస్థితులు వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ కొత్త టెన్షన్‌ మొదలైంది.

Exit mobile version