Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..
- ఇండియాలో తొలిసారిగా ఎంపాక్ క్లాడ్ 1బీ..
- అత్యంత ప్రమాదకరమైన ఎంపాక్స్ స్ట్రెయిన్‌గా గుర్తింపు..
- మలప్పురం వ్యక్తిలో క్లాడ్ 1బీ..
- ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిన బాధితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mpox Clade 1b: దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్‌కి చెందిన ‘‘క్లాడ్ 1బి’’ వెరైటీని గుర్తించారు. క్లాడ్ 1బీకి సంబంధించి ఇదే మొదటి కేసుగా గుర్తించబడింది. కేరళకు చెందిన వ్యక్తికి అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఎంపాక్స్ క్లాడ్-1బీ వెరైటీ సోకినట్లు తేలింది. దక్షిణాసియాలో ఈ వేరియంట్ నమోదైన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాన్ని ఈ రోజు కేంద్రం తెలిపింది. గత వారం కేరళలోని మలప్పురం జిల్లాలో నమోదైన ఎంపాక్స్ కేసు క్లాడ్ 1బికి చెందినదిగా ధ్రువీకరించారు.
వైరస్ సోకిన బాధితుడు యూఏఈ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రస్తుత .మలప్పురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలలో 38 ఏళ్ల వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అతడితో విమానంలో ప్రయానించిన 37 మందితో పాటు 29 మంది స్నేహితులను, కుటుంబ సభ్యులను ఇంట్లోనే క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు వారిలో ఎలాంటి ఎంపాక్స్ లక్షణాలు కనిపించలేదని జిల్లా నోడరల్ అధికారి డాక్టర్ షుబిన్ సి సోమవారం తెలిపారు.
Also Read
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్‌కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
Read Also: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి
ఎంపాక్స్ కొత్త వేరియంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రాలు, యూటీలు అప్రమతంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కొత్త జాతి వ్యాపించడం తర్వాత డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
భారతదేశం 2022 మరియు ఈ సంవత్సరం మార్చి మధ్యకాలంలో క్లాడ్ 2 అని పిలువబడే ఎంపాక్స్ జాతి వల్ల సుమారు 30 కేసులు, ఒక మరణం నమోదైంది. ఈ నెల ప్రారంభంలో మరో క్లాడ్ 2 కేసు నమోదైంది. అయితే క్లాడ్ 1బీ స్ట్రెయిన్ నమోదు అవ్వడం ఇదే తొలిసారి. ఎంపాక్స్ లైంగిక సంపర్కం, శారీరక సంపర్కం ద్వారా వ్యాప్తిస్తుంది.
తాజావార్తలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!