NTV Telugu Site icon

Mpox Clade 1b: ఇండియాలో తొలిసారిగా ప్రమాదకరమైన ఎంపాక్స్ వెరైటీ గుర్తింపు..

Mpox

Mpox

Mpox Clade 1b: దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఎంపాక్స్ వైరస్‌కి చెందిన ‘‘క్లాడ్ 1బి’’ వెరైటీని గుర్తించారు. క్లాడ్ 1బీకి సంబంధించి ఇదే మొదటి కేసుగా గుర్తించబడింది. కేరళకు చెందిన వ్యక్తికి అత్యంత వేగంగా వ్యాపించే లక్షణమున్న ఎంపాక్స్ క్లాడ్-1బీ వెరైటీ సోకినట్లు తేలింది. దక్షిణాసియాలో ఈ వేరియంట్ నమోదైన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ విషయాన్ని ఈ రోజు కేంద్రం తెలిపింది. గత వారం కేరళలోని మలప్పురం జిల్లాలో నమోదైన ఎంపాక్స్ కేసు క్లాడ్ 1బికి చెందినదిగా ధ్రువీకరించారు.

వైరస్ సోకిన బాధితుడు యూఏఈ నుంచి వచ్చినట్లు తేలింది. ప్రస్తుత .మలప్పురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య కళాశాలలో 38 ఏళ్ల వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. అతడితో విమానంలో ప్రయానించిన 37 మందితో పాటు 29 మంది స్నేహితులను, కుటుంబ సభ్యులను ఇంట్లోనే క్వారంటైన్ చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు వారిలో ఎలాంటి ఎంపాక్స్ లక్షణాలు కనిపించలేదని జిల్లా నోడరల్ అధికారి డాక్టర్ షుబిన్ సి సోమవారం తెలిపారు.

Read Also: UP: హిందువునని చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన ముస్లిం.. తప్పించుకున్న యువతి

ఎంపాక్స్ కొత్త వేరియంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రాలు, యూటీలు అప్రమతంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కొత్త జాతి వ్యాపించడం తర్వాత డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

భారతదేశం 2022 మరియు ఈ సంవత్సరం మార్చి మధ్యకాలంలో క్లాడ్ 2 అని పిలువబడే ఎంపాక్స్ జాతి వల్ల సుమారు 30 కేసులు, ఒక మరణం నమోదైంది. ఈ నెల ప్రారంభంలో మరో క్లాడ్ 2 కేసు నమోదైంది. అయితే క్లాడ్ 1బీ స్ట్రెయిన్ నమోదు అవ్వడం ఇదే తొలిసారి. ఎంపాక్స్ లైంగిక సంపర్కం, శారీరక సంపర్కం ద్వారా వ్యాప్తిస్తుంది.