దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 8,822 మంది వైరస్‌బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,245,517కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,24,792కు చేరింది. మంగళవారం 5,718 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,26,67,088కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి శాతం 98.66గా ఉంది. మృతుల శాతం 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.12 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉంది.
భారత్‌లో మంగళవారం 13,58,607 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,50,87,271కు చేరింది. మరో 4,40,278మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.