Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఫైల్స్ భారత్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. లైంగిక నేరస్తుడు ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య పత్రాలను యూఎస్ న్యాయశాఖ విడుదల చేసింది. ఈ పత్రాల్లో అమెరికన్ ప్రముఖులు, రాజకీయ నేతల పేర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పేరు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించింది.
Read Also: IND vs NZ 5th T20: అర్ష్‌దీప్ సింగ్ ‘పంజా’, ఇషాన్ విధ్వంసం.. కివీస్ పై భారత్ ఘన విజయం
ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ఇజ్రాయిల్ పర్యటన గురించి ఎప్‌స్టీన్ పత్రాల్లో కనిపించింది. అయితే, వీటిని భారత విదేశాంగ శాఖ శనివారం తోసిపుచ్చింది. ఈ వాదనలు నిరాధారమైనవిగా, ధిక్కారమైనవిగా పేర్కొంది. ప్రధాని మోడీ 2017లో ఇజ్రాయిల్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ‘‘దోషిగా తేలిని నేరస్తుడి చెత్త పుకార్లు’’ అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 1992లో భారతదేశం- ఇజ్రాయెల్ మధ్య పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత, తొలిసారిగా ఆ దేశంలో పర్యటించిన భారత ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు.
కొత్తగా విడుదలైన ఈ ఫైల్స్‌లో 3 మిలియన్లకు పైగా పేపర్స్, 2000 వీడియోలు, 18 లక్షల ఫోటోలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. 2019లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై ఎప్‌స్టీన్ అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో జైలులోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
