Dalai Lama: దలైలామా ఉనికి లేకుండా చేసేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మక గురువు దలైలామాకు తప్పా తన వారసుడిని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భారత్ చెప్పింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో.. ‘‘దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులకు అత్యంత ముఖ్యమైనది. ఆయనకు మాత్రమే ఆయన వారసుడిని నిర్ణయించుకునే హక్కు ఉంది’’ అని అన్నారు.
Read Also: Car Sales: తగ్గిన టాటా కార్ల అమ్మకాలు.. నంబర్ వన్‌గా మారుతి సుజుకి.. రెండో స్థానంలో…
దలైలామా 90వ పుట్టిన రోజు కార్యక్రమానికి కిరణ్ రిజిజుతో పాటు జేడీయూ నేత లల్లన్ సింగ్ భారత ప్రభుత్వ ప్రతినిధులుగా ధర్మశాలను సందర్శిస్తారు. చైనా బహిష్కృత ఆధ్యాత్మిక నేత, తన 600 ఏళ్ల సంస్థ తన జీవిత కాలం తర్వాత కూడా కొనసాగుతుందని కేంద్రమంత్రి ప్రకటించారు. 5వ దలైలామా ఎంపిక పూర్తిగా దలైలామా అధికారిక కార్యాలయం అయిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌పై ఉంటుందని ఆయన అన్నారు.
దీనికి ముందు, చైనా విదేశాంగ ప్రతినిది మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘దలైలామా వారసత్వం చైనా చట్టాలు మరియు నిబంధనలతో పాటు మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి’’ అని అన్నారు. దీనిని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు విఫలం కావడంతో లాసా నుంచి 1959లో శరణు కోరుతూ దలైలామా భారత్ ఆశ్రయం కోరారు. అప్పటి నుంచి భారత్ లోనే నివసిస్తున్నారు. చైనా ఆక్రమించిన టిబెట్ ను వేరు చేయాలనే దలైలామాను చైనా వేర్పాటువాదిగా ముద్ర వేస్తోంది. 1950లో చైనా టిబెట్‌ని ఆక్రమించుకుంది.
