Site icon NTV Telugu

PIB Fact Check: ఇరాన్ అణు కేంద్రాలపై దాడి.. భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించుకున్న అమెరికా..?

Fact

Fact

PIB Fact Check: ఆపరేషన్‌ ‘మిడ్‌నైట్‌ హ్యామర్‌’ పేరుతో ఇరాన్ లోని అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల కోసం వినియోగించిన యూఎస్ విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక, వీటిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. సంబంధిత పోస్టులు అన్ని నకిలీవిగా తేల్చింది. ఆ ఆపరేషన్‌ సమయంలో భారత గగనతలాన్ని అమెరికా వినియోగించుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ వెల్లడించింది. ఈ దాడుల్లో పాల్గొన్న అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ డేనియల్ కెయిన్‌ మీడియా సమావేశంలో వివరించారని తెలిపింది.. సంబంధిత వీడియో లింక్‌ను ఫ్యాక్ట్ చెక్ పోస్ట్‌ చేసింది.

Read Also: 2026 Pongal Fight : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచే పుంజు ఎవరో.?

అయితే, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తాజాగా అమెరికా దాడులతో అక్కడి పరిస్థితి మరింత దిగజారి పోయింది. తమ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిన వాషింగ్టన్‌ హద్దులు దాటింది, తర్వాత పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు షెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన భారత ప్రధాని మోడీ.. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

Exit mobile version