Research Hub: ప్రపంచవ్యాప్తంగా పరిశోధనా కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. వార్షిక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్, ఉన్నత విద్యా విశ్లేషలకు ప్రసిద్ధి చెందిన క్వాక్వెరెల్లి సైమండ్స్(QS) నివేదిక ప్రకారం.. పరిశోధనలు, అకడమిక్ పేపర్స్ విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా, యూకే తర్వాతి స్థానంలో ఇండియా నిలిచిచింది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో మొత్తం 424 ఎంట్రీలతో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. గతేడాది 355 ఎంట్రీలతో 66 యూనివర్సిటీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
Read Also: PM Modi: వాళ్ల సొంతగడ్డపైనే ఉగ్రవాదుల్ని లేపేస్తున్నాం.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) అగ్రశ్రేని భారతీయ వర్సిటీగా నిలిచింది. డెవలప్మెంట్ స్టడీస్‌లో జేఎన్‌యూ ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో IIM అహ్మదాబాద్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 25 సంస్థలలో ఒకటిగా ఉంది. ఐఐఎం-బెంగళూరు, కలకత్తా టాప్ 50లో ఉన్నాయి. డేటా సైన్స్‌లో, IIT-గువాహటి 51-70 గ్లోబల్ ర్యాంకింగ్‌తో మంచి పనితీరు కనబరిచింది. చెన్నైకి చెందిన సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ స్టడీస్‌లో ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది.
QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 20వ ఎడిషన్‌లో 104 ప్రదేశాలకు చెందిన 1500 ఇన్‌స్టిట్యూట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాకింగ్స్ 17.5 మిలియన్ల అకడమిక్ పేపర్స్, 2.4 లక్షలకు పైగా అకడమిక్ ఫ్యాకల్టీ, నిపుణుల అభిప్రాయాలపై రూపొందించారు. యుఎస్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పన్నెండవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం రెండవ స్థానంలో మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. 101 ర్యాంకుల విశ్వవిద్యాలయాలను కలిగి ఉన్న చైనా తర్వాత ఆసియాలో అత్యధిక ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంగా భారతదేశం ఉంది.