Site icon NTV Telugu

DGMO Meeting: ముగిసిన భారత్-పాక్ డీజీఎంవోల చర్చలు.. ఏం తేల్చారంటే..!

Dgmomeeting

Dgmomeeting

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య కీలక సమావేశం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల డీజీఎంవోలు తొలి దశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్‌ ద్వారా భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి చర్చల్లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలు గురించి చర్చించాయి.

ఇది కూడా చదవండి: EX MLA Jagga Reddy: నేను లీడరైనప్పుడు నువ్వు బచ్చాగాడివి..

వాస్తవానికి ఈ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇందులో భాగంగా సోమవారం ఇరు దేశాల మధ్య తొలి రౌండ్ చర్చలు ముగిశాయి.

ఇది కూడా చదవండి: Viral Video: పాకిస్తానీ మిరాజ్ ఫైటర్ జెట్‌ కూల్చివేత.. వీడియో వైరల్..

 

Exit mobile version