India-Pakistan war: భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది. ఇది అమెరికన్ ప్రయోజనాలపై పరిమిత ప్రభావం చూపొచ్చని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుద కారణంగా భారత్, పాక్ మధ్య తిరిగి సాయుధ సంఘర్షణకు అవకాశం ఉన్నట్లు సీఎఫ్ఆర్ తన కాన్‌ఫ్లిక్ట్ వాచ్ ఇన్ 2026 నివేదికలో పేర్కొంది. భారత్‌తో మాత్రమే కాకుండా, పాక్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సాయుధ ఘర్షణ జరిగే అవికాశం ఉందని నివేదిక తెలిపింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించి పాక్ వ్యాప్తంగా ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 ఎయిర్ బేసుల్ని భారత్ క్షిపణులు ఢీకొట్టి విధ్వంసం సృష్టించాయి. దీని తర్వాత, తాజాగా థింక్ ట్యాంక్ నుంచి ఈ నివేదిక వచ్చింది.
Read Also: Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో మృత్యు ప్రయాణం.. పలువురు మృతి
ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్‌లో చలి, మంచు వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉంది. జమ్మూలో ఇప్పటికే 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, కాల్పులు విమరణ ఉన్నప్పటికీ.. రెండు దేశాలు కూడా రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. డ్రోన్లు, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు మరియు గైడెడ్ బాంబులను కొనుగోలు చేయడానికి భారతదేశ రక్షణ శాఖ ఇటీవల రూ. 79,000 కోట్ల విలువైన కొనుగోళ్లను ఆమోదించింది. ఇదే విధంగా, పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న తర్వాత చైనా, టర్కీల నుంచి కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కోనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది.
