INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు
- మరింత శక్తివంతంగా భారత్
- నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు
- ఇకపై శత్రువు గుండెల్లో దడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారింది. నిన్నామొన్నటి దాకా ఒకెత్తు అయితే ఇప్పుడు మరోకెత్తుగా మారింది. తాజాగా భారత రక్షణ వ్యవస్థలో రెండు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు చేరాయి. దీంతో భారత బలం మరింత పుంజుకోనుంది. ఈ ఆయుధాల చేరికతో శత్రువు గుండెల్లో దడపుట్టాల్సిందే.
భారత నౌకాదళం మరింత శక్తివంతంగా మారబోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. శత్రువును భయపెట్టేందుకు ఐఎన్ఎస్ అరిదమాన్, ఐఎన్ఎస్ తారాగిరిలను నౌకాదళానికి అప్పగించబోతున్నట్లు పేర్కొన్నారు. రెండు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బలమైన అణు జలాంతర్గామిలు. మొదటిది ఐఎన్ఎస్ అరిదమాన్ కాగా.. రెండవది అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి. ఈ రెండు కూడా శత్రు దేశాలు భారత జలాలు వైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణికిపుట్టిస్తాయి.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
‘‘ఇవి కేవలం మాటలు కాదు.. ఇది శక్తి.’’ అని ఎక్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్ రాసుకొచ్చారు. ‘‘ఈ జలాంతర్గామి భారతదేశపు సముద్ర అణు భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.’’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘‘ఐఎన్ఎస్ తారాగిరి’’ని నౌకాదళానికి రాజ్‌నాథ్‌సింగ్ అప్పగించనున్నారు.
ఐఎన్ఎస్ అరిదమన్ సుదూర క్షిపణులతో కూడి ఉంది. ఇది శత్రువులను మరింత దూరం నుంచి లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ జలాంతర్గామి ఇప్పుడు తన తుది సముద్ర పరీక్షలను పూర్తి చేసుకుంది. త్వరలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ప్రవేశించబోతుంది. దీనికి ముందు 2016లో ఐఎన్ఎస్ అరిహంత్, ఆగస్టు 2024లో ఐఎన్ఎస్ అరిఘాట్ ప్రవేశపెట్టారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘తారాగిరి’ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమయంలోనే ‘‘అరిదమాన్’’ గురించి కూడా ప్రస్తావించారు. ఈ జలాంతర్గామి ఏప్రిల్, మే నెలల మధ్య సేవలోకి ప్రవేశిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి డిసెంబర్ 2025లోనే తెలిపారు. ప్రస్తుతం తుది పరీక్షలు పూర్తయ్యాయి
స్టెల్త్ టెక్నాలజీ: ఇందులో మెరుగైన సోనార్-శోషక పూత, శబ్దాన్ని తగ్గించే సాంకేతికత ఉన్నాయి, దీంతో శత్రువులు దీనిని గుర్తించడం కష్టమవుతుంది.
దీర్ఘ పరిధి: కె-4 క్షిపణులతో ఇది శత్రువు యొక్క లోతట్టు భూభాగాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది భారతదేశ భద్రతకు అత్యంత కీలకం.
స్వదేశీ సాంకేతికత: ఈ జలాంతర్గామి సుమారు 70 శాతం స్వదేశీ సామగ్రిని ఉపయోగిస్తుంది. ఇది భారతదేశ స్వావలంబనను చాటిచెబుతుంది.
शब्द नहीं शक्ति है, ‘अरिदमन’!
— Rajnath Singh (@rajnathsingh) April 3, 2026
Tomorrow, 03 April, I shall be in Visakhapatnam to attend the Commissioning Ceremony of the advanced stealth Frigate ‘Taragiri’.
This commissioning highlights the strategic and maritime importance of India’s eastern seaboard as well as the Indian Navy’s sustained focus on… pic.twitter.com/rOSxZ9Ftuz
— Rajnath Singh (@rajnathsingh) April 2, 2026
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?