NTV Telugu Site icon

Manish Sisodia: ఇండియాకు చదువుకున్న ప్రధాని కావాలి.. జైలు నుంచి మోడీకి సిసోడియా లేఖ

Modi, Sisodia

Modi, Sisodia

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేకలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు.

మురికి కాలువలోని డర్టీ గ్యాస్ ని టీ, ఫుడ్ తయారు చేయడానికి ఉపయోగించవచ్చని ప్రధాని చెప్పడాన్ని వింటే నా గుండె తరుక్కుపోతోంది, మేఘాల వెనక ఉన్న విమానాలను రాడార్లు గుర్తించలేవనే వ్యాఖ్యలతో పాఠశాల, కళాశాల విద్యార్థులను ప్రధాని ఎగతాళి చేస్తున్నారని సిసోడియా లేఖలో పేర్కొన్నారు. గతంలో నేను పెద్దగా చదువుకోలేదని ప్రధాని చెబుతున్న వీడియోలు చూశానని, తాను గ్రామంలో పాఠశాలలో చదువుకున్నానని అన్నారని, ఒకరు తక్కువగా చదువుకోవడాన్ని గొప్పగా చెబుకుంటారా..? అని ప్రశ్నించారు.

Read Also: Kerala train attack: కేరళ రైలు ఘటనలో సంచలన విషయాలు.. ఉగ్రదాడిగా గుర్తించిన ఏటీఎస్

దేశ యువత ఏదో సాధించాలనే ఆశతో ఉన్నారని, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, యువత ప్రపంచాన్ని గెలవాలని కోరుకుంటున్నారని, సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు చేయాలనుకుంటున్నారు, చదువుకోని ప్రధాని యువత ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ఉందా..? అంటూ ప్రశ్నించారు. ఓ వైపు జనాభా పెరుగుతుంటే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరగాలి అని ఆయన అన్నారు.

మనీష్ సిసోడియా రాసిన లేఖపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం అని, మోదీజీకి సైన్స్ అర్థం కాదని, మోదీకి చదువు ప్రాధాన్యత అర్థం కావడం లేదని, గత కొద్దికాలంగా 60 వేల స్కూళ్లు మూతపడ్డాయని, భారతదేశం అభివృద్ధి చెందాలంటే విద్యావంతులైన ప్రధాని అవసరం అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాని విద్యార్హతకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని 2016లో గుజరాత్ యూనివర్సిటీని సమచార కమిషనర్ ఆదేశించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గుజరాత్ యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ప్రధాన సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ, కేజ్రీవాల్ కు రూ. 25,000 జరిమానా విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.