దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తర్వాత కొత్తగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 13 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోందని తెలిపింది. గత వారం ప్రపంచవ్యాప్తంగా 48 లక్షల కేసులు, 86 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ పేర్కొంది. అంతకుముందు వారంతో పోలిస్తే మరణాలు 5 శాతం, కొత్త కేసులు 12 శాతం తగ్గుముఖం పట్టాయని వివరించింది. మే 16 నాటికి అందిన సమాచారం మేరకు ప్రకటన చేసింది.
కరోనా కేసులు తగ్గాయి కానీ.. అగ్రస్థానంలోనే వున్నాం
