Site icon NTV Telugu

India-China: లడఖ్‌లో ఏర్పాటు చేసిన చైనా కౌంటీలపై భారత్ అభ్యంతరం

India China

India China

చైనా-భారత్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతున్న తరుణంలో మరోసారి డ్రాగన్ దేశం హద్దులు దాటింది. లడఖ్ సరిహద్దులో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా ఆక్రమణలను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. చట్ట విరుద్ధ, బలవంతపు ఆక్రమణలు చేయడం వల్ల వాటికి చట్టబద్ధత కల్పించినట్లు కాదని తెలిపింది. ఇదే అంశంపై దౌత్యమార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ శుక్రవారం వెల్లడించారు.

ఇది కూడా చదవండి: NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే

డిసెంబర్ 27న చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. చైనాలోని హోటాన్‌ ప్రాంతంలో కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. హోటాన్ ప్రిఫెక్చర్ ద్వారా నిర్వహించబడుతున్న కౌంటీల స్థాపనను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, స్టేట్ కౌన్సిల్ సెంట్రల్ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. అయితే ఈ ప్రాంతాలు భారతదేశంలోని కేంద్ర పాలిక ప్రాంతమైన లడఖ్‌ పరిధిలోకి వస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలోని భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో భారత్‌కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై చైనా ఆక్రమణకు అవకాశం ఇవ్వబోదని తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా చైనాకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యశ్రీపై సర్కార్‌ కీలక నిర్ణయం..

Exit mobile version