NTV Telugu Site icon

వేగంగా టీకాలు వేస్తున్న దేశం మ‌న‌దే-కేంద్రం

13 crore vaccine

క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. ఇప్పుడు భార‌త్‌లో 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వేగంగా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది.. ఇక‌, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ ఇస్తారు.. అయితే, ఇత‌ర దేశాల‌తో పోలిస్తే.. భార‌త్‌లోనే వేగంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ సాగుతోంద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.. కేవ‌లం 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ పేర్కొంది.. వేగంగా క‌రోనా టీకాలు ఇచ్చిన దేశం మ‌న‌దేన‌ని.. అదే అమెరికాలో అయితే, 13 కోట్ల కోవిడ్ టీకా డోసులు ఇచ్చేందుకు 101 రోజులు, చైనాలో అయితే 109 రోజులు ప‌ట్టింద‌ని వెల్ల‌డించింది. గ‌త 24 గంటల్లో భార‌త్‌లో 29,90,197 మందికి వ్యాక్సినేష‌న్ ఇవ్వ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకున్న‌వారి సంఖ్య 13,01,19,310కి చేరింద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.