Site icon NTV Telugu

Airspace ban: పాక్ విమానాలు ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..

Pia

Pia

Airspace ban: పాకిస్తాన్ విమానాలకు భారత గగనతల నిషేధాన్ని కేంద్రం జూన్ 23 వరకు, అంటే మరో నెల పాటు పొడగించింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు లీజు తీసుకున్న, వాటి యాజమాన్యం కింద నడపబడుతున్న విమానాలతో పాటు సైనిక విమానాలు భారత ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్ విధించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దాడి చేస్తుందనే అనుమానంలో పాకిస్తాన్ ముందుగా తన ఎయిర్ స్పేస్‌ని భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు నిషేధించింది. ఆ తర్వాత, పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది.

Read Also: Uttam Kumar Reddy: నోటీసులకు ఎందుకు భయపడుతున్నారు? కేసీఆర్, హరీష్ రావులకు మంత్రి ప్రశ్న

భారత విమానాలకు పాకిస్తాన్ తన గగనతల మూసివేతను మరో నెల రోజులు పొడిగించిందని మీడియా నివేదికలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది. పహల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద దాడిలో 26మంది మరణించిన తర్వాత, ఏప్రిల్ 23న పాకిస్తాన్ తొలిసారిగా భారత విమానాలకు తన గగనతలాన్ని మూసేసింది. ఒక వారం తర్వాత భారత్ కూడా ఇదే విధంగా పాకిస్తాన్ విమానాలకు ఎయిర్‌స్పేస్ బ్యాన్ విధించింది.

Exit mobile version