Site icon NTV Telugu

Cyber Fraud : సైబర్ నేరస్థులకు సింహస్వప్నం.. సైబర్ నేరగాళ్లను పట్టేందుకు స్పెషల్ టెక్నాలజీ రెడీ

Cyber Fraud

Cyber Fraud

ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక నష్టాలకు దారితీస్తున్నాయి.

సైబర్ నేరాలను అరికట్టేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో సైబర్ టీంలను ఏర్పాటు చేశారు.. అయితే కేంద్రం సైతం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు పోలీసులకు కొన్ని అధికారాలను అప్పజెప్తుంది. సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాలను జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. అంతేకాదు అనుమానితుల లొకేషన్లను, బ్యాంకింగ్ . టెలికాం సోర్స్ ల వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేలా తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు పెరిగిపోతున్న సైబర్ మోసాలపై దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజలకు విస్త్రత అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

సైబర్ క్రైంను అరికట్టేందుకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం సమన్వయ్ ప్లాట్‌ఫాం ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల ఖచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికాం వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ప్రతిబింబ్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది.

మరోపక్క సైబర్ క్రైమ్ ఇంటర్‌స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్‌కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించవచ్చని కేంద్ర హోంశాఖ చెప్తొంది. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్ కార్డులను, వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు కేంద్ర హోంశాఖ అధికారాలు కల్పిస్తుంది. బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీటీవీ వీడియోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు వేగంగా సేకరించవచ్చు. క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి, అలాగే విచారణలకు అవసరమైన టూల్స్ ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో-లీగల్ సపోర్ట్ సర్వీ స్ ను కూడా కేంద్ర హోంశాఖ అందుభాటులోకి తీసుకు వచ్చింది.

అత్యంత నైపుణ్యం కలిగిన పోలీసు అధికారులతో కేంద్ర హోంశాఖ కోర్ టీమ్‌ను తయారు చేస్తోంది. సైబర్ కమాండో ప్రోగ్రాం లో భాగంగా IT ఇన్ఫ్రా-స్ట్రక్చర్ రక్షణకు, సైబర్ సంఘటనలకు స్పందనకై (Incident Response) డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో వీరంతా నిష్ణాతులై ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సైబర్ కమాండో లో తొలి బ్యాచ్‌లో 407 మంది కమాండోలు NFSU, IITs, IIITs, DIAT, RRUలలో శిక్షణ పొంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు.

Exit mobile version