Site icon NTV Telugu

Covid Cases: ఇండియాలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి.. కొత్తగా కేసులు ఎన్నంటే?

Corona News

Corona News

Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,917 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఒక రోజులో 32 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,17,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేస్ లోడ్ శాతం 0.27గా ఉంది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. డైలీ పాజివిటీ రేటు 4.36గా ఉంది.

Urfi Javed: శృంగారం చేయాలంటూ నన్ను టార్చర్ పెడుతున్నాడు.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి 5,27,069 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు కరోెనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4,36,23,804గా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 208.25 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. ఆదివారం 25,50,276 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆదివారం 1,98,271 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా59,50,96,639 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 64,54,505 మంది మరణించారు. జపాన్, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కరోజే 6,90,556 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,82,70,599కు చేరింది.

Exit mobile version