భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,68,063 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. వారంలో ఒకటి రెండు రోజులపాటు వీకెంట్ కర్ఫ్యూలు విధించడం వలన కేసులు కొంత మేర అదుపులోకి వస్తున్నాయి.
Read: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్…
Also Read
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్‌కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Vishal Garg: ఒక్క వీడియో కాల్‌తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
నైట్, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తూనే వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేయడం కూడా ఇందుకు కలిసివస్తోంది. నిన్నటి నుంచి దేశంలో మూడో డోస్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. 2.75 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారికి, కోటి మంది హెల్త్ వర్కర్లకు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు ప్రికాషనరీ డోస్‌లు వేస్తున్నారు. రెండో డోసు కింద ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో మూడో డోస్ కింద అ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, 18 ఏళ్లు దాటిన అందరికి మూడో డోస్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తాజావార్తలు
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
-
Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!