ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. ప్రతిరోజు 30 నుంచి 40 వేల మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 38,353 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,511 కి చేరింది. ఇందులో 3,12,20,981 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 3,86,351 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 497 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,29,179కి చేరింది. కేరళలో అత్యధికంగా 21వేలకు పైగా కేసులు నమోదవ్వగా, మహారాష్ట్రలో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
