NTV Telugu Site icon

ఇండియాలో కరోనా బీభత్సం: మళ్ళీ నాలుగు లక్షలు దాటిన కేసులు…

ఇండియాలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉధృతం అవుతున్నది.  రోజువారీ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  తాజాగా దేశంలో 4,12,262 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది.  ఇందులో 1,72,80,844 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35,66,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 3,980 కరోనా మరణాలు నమోదయ్యాయి.  దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,30,168కి చేరింది.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనా నుంచి 3,29,113 మంది కోలుకున్నారని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.