NTV Telugu Site icon

ఇండియా క‌రోనా అప్డేడ్‌…మూడు వేల‌కు దిగువున మ‌ర‌ణాలు…

ఇండియాలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది.  క‌రోనా కేసులు ప్ర‌స్తుతం ల‌క్ష‌న్న‌ర‌కు దిగువున న‌మోద‌వుతున్నాయి.  అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  కేంద్రం రిలీజ్ చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 1,34,154 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,84,41,986కి చేరింది.  ఇందులో 2,63,90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,13,413 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2887 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,37,989కి చేరింది.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 2,11,499 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.